నకిలీ విత్తనాలతో రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ,ఏవో, హెచ్చరికలు 

నవతెలంగాణ – మద్నూర్
పోలీస్ శాఖ మండల వ్యవసాయ శాఖ సంయుక్తంగా శనివారం నాడు మద్నూర్ మండలంలోని  మేనూర్, పెద్ద ఎక్లరా ,గ్రామాలలో గల ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అలాగే సీడ్స్ షాప్స్ తనిఖీలు చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే మా దృష్టికి తీసుకు రావాల్సిందిగా రైతులను కోరడం జరిగింది. ఎవరైనా అలా అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడును అని హెచ్చరికలు జారీ చేశారు. వానాకాలం పంట సాగులో భాగంగా రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. లైసెన్సు గల షాపుల్లోనే విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన వాటికి రసీదులు తప్పకుండా తీసుకోవాలని దుకాణదారులు అధిక ధరల కమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని రైతులకు ఎంఆర్పి రేట్లకే అమ్మాలని సూచించారు. రైతులు మోసపోకుండా నకిలీ విత్తనాలు అమ్మకూడదని ఒరిజినల్ గా విత్తనాలు అందించాలని పార్టీలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ షాపుల యజమానులకు తనిఖీల్లో భాగంగా హెచ్చరికలు జారీ చేశారు.