నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో ని బీరెల్లి, రంగాపూర్ గ్రామాలలో స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సీసీ కెమెరాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు గురించి సీసీ కెమెరాలు ఎంతగానో దూదపడతాయని మరియు టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత దగ్గర సేవలు చేయడానికి సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని తెలిపినారు. అమాయకులను చట్టం నుండి రక్షించడానికి సిసి కెమెరాలు బాగా ఉపయోగపడతాయని సీసీ కెమెరాలు ఫుటేజ్ వల్ల కోర్టులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపినారు. సీసీ కెమెరాల వల్ల నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని అదే కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కూడా ఉపకరిస్తాయి అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్ తో సమానమని, 24 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని తెలిపినారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాగా గత వారం రోజులు క్రితం దామరవాయిలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీరెల్లి గ్రామం నుండి యువత అధిక ప్రాధాన్యత తో ఎక్కువమంది రక్తదానం ఇచ్చారు. స్థానిక శ్రీకాంత్ రెడ్డి స్పందించి బీరెల్లి స్కూల్లో విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ (జీకే) బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.