వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

SSI conducted the vehicle inspectionsనవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కరీంనగర్ టు వరంగల్ జాతీయ రహదారిపై  స్థానిక ఎస్సై కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో ఆదివారం వెహికిల్ చెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని నంబర్ ప్లేట్ లేని వాహనాలను,ట్యాంపరింగ్ చేసిన,సగం నంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. తప్పనిసరి హెల్మెట్ ధరించాలని  మద్యం తాగి వాహనాలు నడిపితే ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. మైనర్లు వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే క్రిమినల్ కేసులు తప్పవని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.