సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి: ఎస్సై గంగిడి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – బొమ్మలరామారం

బొమ్మలరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై,మూఢనమ్మకాలు,భాల్య వివాహాలు,సమాజంలో జరుగుతున్న పలు రకాల మోసాలపై ఎస్సై గంగిడి శ్రీనివాస్ రెడ్డి గురువారం అవగాహన కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఫోన్ ద్వారా వచ్చే సైబర్ నేరాల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు.అనవసరమైన లింకులను క్లిక్ చేయవద్దన్నారు.పదవ తరగతి పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు మొదటి ర్యాంకు విజేతకు 5వేల రూపాయలు నగదు బహుకరణ అందజేస్తానని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి : నేడు కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కోరారు. అన్ని రకాల కేసులు ఉన్నవారు రాజు పడేందుకు మంచి అవకాశం అని తెలిపారు. కేసులు ఉన్నవారు ముందుగానే  పోలీసులను సంప్రదించి వివరాలు అందజేయాలని కోరారు. రాజీమార్గం రాజామార్గమని చిన్నచిన్న విషయాలకు గొడవపడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.