కొత్తగట్టులో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఎస్సై లక్ష్మారెడ్డి

నవతెలంగాణ – శంకరపట్నం
రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు కేంద్ర బలగాలతో కలిసి స్థానిక ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యం శనివారం శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు.ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ప్రజాస్వామ్యానికి  విరుద్ధంగా వ్యవహరించేవారికి తగిన చర్యలు తప్పవని ప్రజలకు సూచించారు.ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు కూడా ఏలాంటి  ప్రలోభాలకు గురి కాకుండా  స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓటర్ లందరికీ రక్షణగా మేమున్నామని కవాతు నిర్వహించారు. ఎవరైనా యువకులు వాట్సాప్ గ్రూపులలో పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పోస్టులు చేసినట్లయితే వారికి చట్టరీత్య చర్యలే కాకుండా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని ఆయన తెలిపారు.  ప్రజలందరూ స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది కేశవపట్నం పోలీస్ సిబ్బంది కొత్తగట్టు దేవదాయ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి ,గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.