శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: ఎస్సై మహేష్

Si-Maheshనవతెలంగాణ-పెద్దవంగర
మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పెద్దవంగర నూతన ఎస్సై మహేష్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సై గా పని చేసిన పిల్లల రాజు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబాబాద్ సీసీఎస్ లో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఎస్సై తొర్రూరు డీఎస్పీ సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.