– కుటుంబానికి రూ.25 వేలు ఆర్ధిక సాయం అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తు ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నివాళులు అర్పించారు. శ్రీనివాస్ దశదినకర్మ వరంగల్ జిల్లా,నల్లబెల్లి మండలం,తన స్వగ్రామం అయిన నారక్కపేట లోని ఆయన గృహంలో బుధవారం తన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాటి వెంకటేశ్వర్లు,సుదర్శన్ రెడ్డి లు శ్రీనివాస్ చిత్రపటానికి పూలు వేసి పుష్పాంజలి అర్పించారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం శ్రీనివాస్ భార్య క్రిష్ణ వేణి కి రూ 25 వేలు చెక్ ను ఆర్ధిక సాయం గా అందించారు. ఈ కార్యక్రమం లో ముదిగొండ శ్రీనివాస్, గాదెగోని వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.