స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూసీ)

స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూసీ)– రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సంజీవరెడ్డి, జి.అబ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూసీ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్‌ జి.సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి.అబ్రహం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో గల ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. అందులో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా సయ్యద్‌ మహమూద్‌, గంట సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులుగా వైడి బెస్‌ సుశీల్‌, సంయుక్త కార్యదర్శిగా మహమ్మద్‌ అఫీజ్‌ఖాన్‌లు కమిటీలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేనేజ్‌మెంట్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.