– ఎలక్షన్ కమిషన్ ఇచ్చే వైలేట్ స్కెచ్ పెన్ తోనే ప్రాధాన్యత ప్రకారం 1,2,3….నెంబర్లు రాయాలి..
– జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు..
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో పిబ్రవరి 27 న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓఎపిఓలకు నిర్వహించిన శిక్షణలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పిబ్రవరి 27 నాడు నిర్వహించడం జరుగుతుందని ఎ ఒక్కరికి విధుల నుండి మినహాయింపు లేదని అందరు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారని, బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యత ప్రకారం ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చే వయలేట్ స్కెచ్ పెన్ తో మాత్రమే పోటీ చేసే అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1,2,3.. ఇ టి సి అనే నెంబర్లు సీరియల్ ప్రకారం వేయాలని,మధ్యలో అసంపూర్తిగా నెంబర్లు వేస్తె ఓటు చెల్లదు అని అన్నారు.పిబ్రవరి 26 నాడు ఉదయం 7 గంటల కే సిబ్బంది అందరు బ్యాలెట్ పంపిణి కేంద్రాలకి చేరుకోవాలని, అక్కడ తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రం కు సంబంధించి ఓటర్ల జాబితా, అన్ని ఫారంలు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లు, ఎలక్షన్ సామాగ్రి, ఇండెలీబుల్ ఇంక్ బాటిల్ లాంటివి అన్ని ఉన్నాయో లేవో జాగ్రత్తగా పరిశీలించి నిర్దారణ చేసుకోవాలని లేకపోతె అధికారులకు తెలియపర్చాలని అన్నారు. సిబ్బంది ఎలక్షన్ సామాగ్రి తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన బస్సు ద్వారా నే ఎస్కార్ట్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి పిఓఏపిఓ ఇద్దరు ఓపిఓలు అనే నలుగురు సిబ్బందిని కేటాయిస్తారని ఎపిఓ మార్కెడ్ కాఫీకి ఇంచార్జిగా ఉంటూ పురుషులకి రెడ్ పెన్ తో అండరు లైన్ గీయాలనీ, స్త్రీ ఓటర్లకి అండరు లైన్ తో పాటు సీరియల్ నంబర్ టిక్ కొట్టాలని, 3ర్డ్ జెండర్ లకి అండరు లైన్ తో పాటు స్టార్ మార్క్ పెట్టాలని తెలిపారు. ఫస్ట్ ఓ పి ఓ ఎలక్షన్ కమిషన్ ఇండెలీబుల్ ఇంక్ తో ఎడమ చేతి చూపుడు వేలుపై చర్మం నుండి గోరు వరకు గీత గీయాలనీ అలాగే బ్లెయిండ్ ఓటర్లు వస్తే వారితో పాటు కంపనీయన్ ని అనుమతించి బ్లెయిండ్ వారికి ఎడమ చేతి చూపుడు వేలుకి , కంపనియన్ కి కుడి చేతి ఎడమ వేలుకు ఇండెలీబుల్ ఇంక్ తో గుర్తు పెట్టాలని అన్నారు.2వ ఎ పి ఓ బ్యాలెట్ పేపర్ కి ఇంచార్జి గా ఉంటారని ఓటర్ తో కౌంటర్ పైల్ మీద సంతకం వేలు ముద్ర తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన 16 డాక్యుమెంట్ల లో ఏదైనా అనుమతించవచ్చు అని ఓటర్ ఓటర్ కార్డు తెస్తే ep అని, వేరే గుర్తింపు కార్డు తీసుకవస్తే చివరి 4 నెంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.పిబ్రవరి 27 నాడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం లో ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయరాదని, 200 మీటర్ల దూరం లో పోలింగ్ స్లిప్స్ ఇచ్చుకోవచ్చని తెలిపారు.పోటీ చేసే అభ్యర్థి ముగ్గురు ఎజెంట్స్ ని నియమించుకోవచు కానీ ఒక్కసారి ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని మరో ఇద్దరు బయట ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాతో కూడిన ఫారం 7 B ని అతికించాలని ఉదయం 7:30 గంటలకు పోలింగ్ ఏజెంట్ లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించి వారి సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని చూపించి ఏజెంట్స్ సంతకాలు తీసుకొని బ్యాలెట్ బాక్స్ సీల్ చేసి 8:00 గంటలకి పోలింగ్ మొదలు పెట్టాలని సూచించారు.ప్రతి 2 గంటలకి ఒక్కసారి పోలైనా ఓట్లు సంఖ్యను పి ఓ డైరీ లో నమోదు చేసుకుంటూ ప్రిసైడింగ్ అధికారి పై అధికారులకి తెలియజేయాలనీ సాయంత్రం 4:00 గంటలకి ఓటు వేయటానికి పోలింగ్ కేంద్ర ఆవరణలో ఓటర్లు క్యూ లో నిల్చొని ఉంటే వారికి చివరి నుండి మొదటి వ్యక్తికి సీరియల్ ప్రకారం నెంబర్లు ఇవ్వాలని తెలిపారు.తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు మధ్యాహ్న సమయానికే వంద శాతం పోల్ అయినా కానీ సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు ముసివేయకూడదని సాయంత్రం 4:00 గంటల తర్వాత ఎజెంట్స్ సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ లు సీల్ చేసి ఎజెంట్స్ కి ఫారం -16 ఇచ్చి ఎస్కార్ట్ ద్వారా పోలింగ్ రిసీవింగ్ కేంద్రాలకు తరలించాలని తెలిపారు.ఫారం 14 ద్వారా ఛాలెంజ్ ఓటు నమోదు చేయాలని, ఫారం 15 ద్వారా టెండర్ ఓటు నమోదు చేయాలని, విజిటర్స్ ఎవరైనా వస్తే వారితో సంతకం తీసుకోవాలని, అధికారులు ఖచ్చితంగా ఐ డి కార్డులు ధరించాలని,పోలింగ్ కేంద్రం లోకి మొబైల్, ఆయుధాలు అనుమతి లేదని కంపార్ట్మెంట్ ని వీడియో తీయకూడదని తెలిపారు.తదుపరి పి పి టి ద్వారా ఎలక్షన్ ట్రైనర్స్ ఎన్నికల నిర్వహణ గురించి క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమం లో ఎలక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాసరాజు, డి టి వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.