అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది లేక తాళం

Staff or lock at Anganwadi Centre– నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్, ప్రజలు
నవతెలంగాణ – సిరిసిల్ల
బోనాలలోనీ  అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయా లేని కారణంగా గత ఆరు నెలల నుండి  అంగన్వాడి కేంద్రం మూసి వేశారని పదవ వార్డ్ కౌన్సిలర్ బల్గం నాగరాజు తో పాటు స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.  వార్డు పరిధిలో దాదాపు 20 నుంచి 30 మంది ఆరు సంవత్సరాల లోపు పిల్లలు,అదేవిధంగా గర్భిణీ మహిళలకు అంగన్వాడి కేంద్రల ద్వారా అందే సేవలుఅందడం లేదు.కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పి ఎం పోషణ్, సప్లమెంటరీ న్యూట్రిషన్ స్కీం ద్వారా మహిళల్లో మరియు చిన్నపిల్లల్లో  పోషకాహార లోపాన్ని, రక్తహీనత రూపుమాపేందుకు ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉత్తమమైన సేవలు  అందిస్తుంటే  వార్డు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సేవలు అందడం లేదు కేవలం సిబ్బంది లేకపోవడంతో గత ఆరు నుంచి ఏడు నెలలుగా  వార్డులోని అంగన్వాడీ సర్వీస్ కేంద్రం మూతపడి ఉంది.కాబట్టివెంటనేసంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులువెంటనే భర్తీ చేసే విధంగా   తగు చర్యలు తీసుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు.