నవతెలంగాణ – గంగాధర
అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం సందర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రంగు మారిన, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రంగు మారిన తడిసిన ప్రతి గింజను కొను కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సకాలంలో కొనుగోలు చేయక అకాల వర్షానికి అవస్థ పడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. గెలువగానే రైతుల ఖాతాల్లో వేస్తానన్న రైతుబంధు వేయకపోగా, క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతాంగాన్ని అడుగడుగున మెాసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుంకె వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాల్ రావు, బీఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్, బాల గౌడ్, గంగయ్య, అజయ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం:
అకాల వర్షానికి గంగాధర మండలంలోని ఐకేపీ, సింగిల్ విండో వరిధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసింది. ప్రతి సెంటర్ లో ఇప్పటికే వరిధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తికాగా, పలు సెంటర్లలో కొనుగోలు చేయక మిగిలి ఆరబోసిన ధాన్యంపై కప్పిన పాలిథిన్ కవర్లు భారీ గాలులకు కొట్టుకు పోయి ధాన్యం తడిసింది. మండలంలోని 33 గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేయని ధాన్యం కుప్పలు స్వల్పంగానే ఉండగా, తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించక సంచుల్లోని ధాన్యం కూడా తడిసింది.