తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలి..

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలి..– అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
– మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి
నవతెలంగాణ-మెదక్
అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ పట్టణ పరిధిలోని ఔరంగాబాద్, ఔరంగాబాద్ తండా, అవుసుల పల్లి లో అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం, తడిసిన ధాన్యం రాశులను మంగళవారం ఉదయం సందర్శించి పరిశీలించారు.తడిసిన మొలకెత్తిన చివరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.