తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీమీట్ పోటీల్లో సౌత్, వెస్ట్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు ఉత్తమ ప్రతిభ కనబర్చి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో 3 బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించారు. ఈ పోటీల్లో ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు తన అత్యుత్తమ ప్రదర్శనతో ‘స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావుకు బంగారు, వెండి పతకాలతో పాటు “స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు”ను అందజేసి అభినందించారు.