పురపాలక సంఘం లో పన్నులు వసూలు ప్రారంభం

నవతెలంగాణ – అశ్వారావుపేట : నూతన పురపాలక శాఖ లో ఆద్వర్యంలో పన్నుల వసూళ్ళు ప్రారంభం అయ్యాయి. మున్సిపల్  కమీషనర్ కే.సుజాత ఆదేశాల మేరకు అశ్వారావుపేట పురపాలక సంఘం పేరున రసీదు పుస్తకాలను చేత బట్టి వసూళ్ళు ప్రారంభించారు. మున్సిపాలిటీలో విలీనమైన అశ్వారావుపేట, పేరాయిగూడెం,గుర్రాల చెరువు గ్రామాలలో ఇప్పటివరకు కుంటు బడిన పన్నుల వసూళ్ళను మార్చి చివరి వరకు పూర్తి చేయాలని కమీషనర్ సిబ్బందిని ఆదేశించారు.ఇంటి పన్నులతో పాటు నీటి పన్ను, వ్యాపార రుసుము వంటి పన్నులను వసూళ్ళు వేగవంతం చేయాలని సూచించారు. ఈ వసూళ్ళు కార్యక్రమంలో వార్డు అధికారులు కె. శ్రీరామ్మూర్తి,సందీప్,స్వరూప తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.