వేటాడతా షూటింగ్‌ షురూ..

అంకయ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై అనిత మూవీస్‌ సమర్పణలో అరుణ్‌, సజనలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘వేటాడతా’. సురేష్‌ రెడ్డి దర్శకత్వంలో అంకయ్య ఎమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత రామసత్య నారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సాయి వెంకట్‌ క్లాప్‌ కొట్టారు. వైజాగ్‌ మాజీ మేయర్‌ దాడి సత్యనారాయణ కెమెరా స్విచాన్‌ చేశారు. నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్‌ అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత అంకయ్య ఎమ్‌ మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌లో మా అబ్బాయి అరుణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న నాలుగో చిత్రమిది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సినిమా ఉంటుంది. ఇందులో నేను టైటిల్‌ రోల్‌ చేస్తున్నా’ అని అన్నారు.”బరి’ సినిమా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చింది. ఇది నా రెండో సినిమా. సస్పెన్స్‌, మర్డర్‌ మిస్టరీతో రూపొందుతున్న చిత్రమిది. ఈ నెలాఖరులో షెడ్యూల్‌ ప్రారంభించనున్నాం. అరకు, నంద్యాల, హైదరాబాద్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని దర్శకుడు సురేష్‌ రెడ్డి చెప్పారు. ‘హీరోగా నటిస్తున్న నా తొలి సినిమా ఇది. మా నాన్న మంచి కథ సిద్ధం చేశారు. డైరక్టర్‌ సురేష్‌ రెడ్డి మంచి ప్లానింగ్‌తో షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు’ అని హీరో అరుణ్‌ చెప్పారు.