నవతెలంగాణ – గంగాధర : గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఆ కళాశాల అధ్యాపక బృందం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టి ప్రారంభించారు. ఎవరో వస్తారు..ఏమెా ఇస్తారని ఎదిరి చూడకుండా అధ్యాపకులే స్వంత ఖర్చులు వెచ్చించి విద్యార్థిని, విద్యార్థులకు ప్రతి రోజు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుండి కాలేజీకి వచ్చే విద్యార్థిని, విద్యార్థులు ఆకలితో అలమటించకుండా అల్పాహారాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల ఆధ్వర్యంలో ఆధ్యాపకులు సొంత ఖర్చులు వెచ్చించి అల్పాహారం వడ్డించాలని నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అనుకున్నది తడవుగా అమలు చేశారు. ఈ అల్పాహార పథకం ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రమీల, అధ్యాపకులు పాల్గొన్నారు