ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభం..

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ ఎమ్మెల్యే పోన్నం ప్రభాకర్  రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం హుస్నాబాద్ లో శనివారం ఆర్టీసీ బస్టాండ్ లో  ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణన్ని ఆర్టీసీ డిఎం, హుస్నాబాద్ కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రాంత మహిళా సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం చాలా సంతోషకరమని మహిళ నాయకురాలు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు, వెన్న రాజు,బొంగోని శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.