నవతెలంగాణ- అక్కన్నపేట : అక్కన్నపేట మండల పరిధిలోని గోవర్ధనగిరి, ధర్మారం, చౌటపల్లి, మంచినీళ్ల బండ, పెద్దతండ, గొల్ల కుంట, నందారం, పెద్ద తండ తో పాటు పలు గ్రామాలలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకొని మద్దతు ధర తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీలు తిరుపతి, శివ చరణ్ సింగ్, బిక్షపతి, ఏఈవోలు, గ్రామ కార్యదర్శులు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.