మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు సోమవారం దాతల సహకారంతో కళాశాల ప్రిన్సిపాల్ విజయ దేవి, తాజా మాజీ ఎంపీపీ చింతల మలహర్ రావు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాలు, అసోసియేషన్ సభ్యులు, వివిధ ట్రస్ట్ సభ్యులు, యజమానులు సేవ భావ దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ మధ్యాహ్న భోజనం వల్ల మార్చిలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసం విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు: గ్రామీణ వైద్యుడు కుక్కడపు అశోక్, కట్టే కోళ్ల కుమార్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.