నూతన బోరు మోటర్ ప్రారంభం..

New bore motor launch..నవతెలంగాణ – బొమ్మలరామారం

మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కేతమ్మ గుడి ప్రాంగణంలో శ్రీకృష్ణ యాదవ సంఘం మండల అధ్యక్షులు ఈశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ కుకుట్ల ఈశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన బోరు మోటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నూతన బోరు వేసి భక్తులకు ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజల శ్రేయస్ కోసం ఈశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యాదవ సంఘం నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.