– శ్రీ గణేష్ చేస్తున్న సామాజిక సేవలు హర్షణీయం : మర్రి రాజశేఖర్ రెడ్డి
– కీడల వల్ల స్నేహభావం : శ్రీ గణేష్
నవతెలంగాణ-కంటోన్మెంట్
క్రీడాకారులలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ ఆదివారం బోయిన్‌పల్లి ప్లే గ్రౌండ్‌లో ఎస్‌జీఎఫ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్న మెంట్‌ను బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు పలు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువకులను క్రీడాకారులను ఉత్సాహపరి చేందుకు శ్రీ గణేష్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. అంతేకాకుండా శ్రీ గణేష్ చేస్తున్న సామాజిక సేవలు హర్షణీయమని కొనియాడారు అంతకుముంద బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ గణేష్ మాట్లాడుతూ క్రీడల వల్ల యువతలో స్నేహభావం కలుగుతుందని, అంతేకాకుండా వారిలో ఉన్న నైపుణ్యం వెలికి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా ఉండేందుకుగాను, వారి ధ్యాస క్రీడల వైపు మళ్లించేందుకు తాను ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నానని తెలిపారు. గెలిచినవరు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకోవాలని, ఓడిపోయిన వారు తదుపరి గమ్యస్థానం చేరుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఎస్‌జీఎఫ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్‌కు అనుకున్నదానికంటే మంచి స్పందనవచ్చిందని, 32 జట్లు ఈ టోర్నమెంట్ లో పోటీ పడుతున్నాయని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనత రువాత పాఠశాల స్థాయి క్రీడలను కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్ర మంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ సభ్యుడు అరుణ్ యాదవ్ , బీఆర్‌ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్ , అమీర్ ఇమ్రాన్ , శరత్ , లిఖేష్ . ప్రతాప్ , అనిల్ తదితరులు పాల్గొన్నారు.