స్టడీ సెంటర్ ప్రారంభం

నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో  వడ్ల విట్టల్ కుమారుడు, వడ్ల రమేష్ తన తండ్రి వడ్ల విట్టల్ సౌజన్యంతో పేదవారి కోసం ఏదో చేయాలని స్టడీ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జంగం భూషణం మాట్లాడుతూ వడ్ల  విట్టల్ కుమారుడు ఫౌండర్ వడ్ల రమేష్  పేరుపైనను  తమ నివాస గృహంను స్టడీ సెంటర్ క్యాబిన్ గా మార్చి విద్యార్థులు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణము ఏర్పాటు చేశారు.  స్టడీ సెంటర్ క్యాబిన్ రూములో మౌలిక వసతులు సదుపాయాలను పరిశీలించారు.  అనంతరం వడ్ల రమేష్ ఫౌండర్ మాట్లాడుతూ, ఉద్యోగ అవకాశాల కోసం ప్రిపేర్ కావడానికి కోచింగ్ తీసుకునే విద్యార్థులు మౌలిక అత్యా ఆధునిక, ఉన్నత సదుపాయాలతో ఉద్యోగుల కోసం చదువు కోసం వచ్చిన స్టడీ సెంటర్లో వారి యొక్క రక్షణ నీగా ,కొరకు సీసీ కెమెరాలు ,ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే  మినిరల్ డ్రింకింగ్ వాటర్, విద్యార్థులు అసౌకర్యం లేకుండా వాష్రూమ్స్ , మరియు, లంచ్ చేయడానికి, డైనింగ్  హాల్  విద్యార్థులు చదువు పైన చర్చించుకోవడానికి, కాన్ఫరెన్స్ హాల్, ప్రత్యేకమైన గది రూమ్స్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.  కృష్ణాజివాడి  గ్రామంతో,పాటు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలలో దూర ప్రాంతాలకు విద్యాభ్యాసం కొరకు ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లి ప్రిపేర్ కావడనికు వెళ్ళని పరిస్థితి ఉన్న పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విద్యార్థులు ప్రతిభ ఉన్న కుటుంబ పరిస్థితులు భారం కావడంతో , ఉద్యోగ అవకాశాలు కోసం ప్రిపేర్ కాకుండా చాలామంది విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభ ఉన్న  చదువుకోడానికి అనుకూలమైన ప్రాంతం, మరియు, డబ్బు లేకపోవడం వల్ల ఎంతోమంది ,విద్యార్థులు అనేక ప్రైవేట్ రంగాలలో కూలి లేబర్ పనులు చేసుకుంటున్నారు. ఇట్టి విషయం, వడ్ల రమేష్ అనే నాకు చాలా బాధ అనిపించి అన్ని దానాల కన్నా, విద్యా దానం గొప్పదని ఒక సంకల్పబలంతో, తన పుట్టి పెరిగిన, కన్న గ్రామానికి, ఏదో ఒకటి చేయాలని తపనతో నా వంతు చిన్న కృషిగా స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కొక్క విద్యార్థినుండి నెలకు 300 రూపాయల ఫీజు, చొప్పున రూమ్ మెయింటెనెన్స్  నెలసరి ఖర్చులకోసం అనగా మినిరాల్ వాటర్, కరెంట్ బిల్లు, వాచ్మెన్, రూమ్ క్లీనర్ బాయ్, కొరకు నెలసరి ఖర్చులు ఉంటాయి కావున, ఒక్కొక్క విద్యార్థి, 300 రూపాయలు ఇస్తే సరిపోతుందని, అలా కచ్చితంగా 300 రూపాయలు తప్పనిసరి, ఇవ్వలని లేదు   పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ సెంటర్లో చదువుకోడానికి అవకాశం ఉంటుందని, ఈ స్టడీ సెంటర్ వ్యాపారంలా భావించవద్దని, ఇది ఒక సేవ కార్యక్రమంగా భావిస్తున్నానని, కామారెడ్డి జిల్లాలో కృష్ణాజివాడి గ్రామానికి వడ్ల విట్టల్ స్టడీ సెంటర్ లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ అవకాశాల్లో రాణించి ప్రతిభను చూపుతో ఉద్యోగం పొందాలని తమ ఆశయ సంకల్పన బలమని తెలియజేశారు. ఎవరైనా గ్రామ పెద్దలు యువజన సంఘం నాయకులు స్టడీ సెంటర్లో పేద విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ చదువుకోడానికి బుక్స్ డొనేట్ చేయవచ్చు బుక్స్ డొనేట్ చేసిన వారి యొక్క పేరు  చిరస్థాయి వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శాంతాబాయి నారాయణరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్  సత్యనారాయణ, వేణుగోపాల్, ప్రతాప్ రెడ్డి విశ్వబ్రహ్మ విశ్వకర్మల తాడ్వాయి మండల అధ్యక్షులు దేమే రాజు, ప్రభాకర్ ప్రవీణ్ రెడ్డి అంజు విద్యార్థులు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.