మండల కేంద్రంలో రైతుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ సెంటర్ ను శుక్రవారం కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రోమోర్ కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఫర్టిలైజర్ లకు సంబంధించిన నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయన్నారు. అవి కూడా రైతులకు సరసమైన ధరలకే లభిస్తాయని, పరిసర ప్రాంత రైతులు మన గ్రోమోర్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మందలాధ్యక్షులు సుంకేట రవి, నాయకులు సుంకేట శ్రీనివాస్, ఉట్నూర్ ప్రదీప్, అజార్, బెజ్జారం భాను, మండల వ్యవసాయాధికారి రమ్యశ్రీ, మన గ్రోమోర్ కంపెనీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.