– టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ దిక్సూచి అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజల ఆలోచనలకు రాష్ట్ర బడ్జెట్ దగ్గరగా ఉందన్నారు. గత పదేండ్ల కాలంలో బడ్జెట్ హైప్ తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు. పదేండ్ల కేసీఆర్ బడ్జెట్ ఊహల్లో విహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ఆరోపించారు.