రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అన్నారు. వీధి వ్యాపారులు మొదలు రైతులు పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయించడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం,సాగు,తాగునీటికి, విద్య , వైద్యం కాకుండా సబ్బండ వర్ణాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు.