– సీఏఏను నిరసిస్తూ విస్తృత క్యాంపెయిన్ : వామపక్ష పార్టీల నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నదని వామపక్ష పార్టీలు విమర్శించాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 22న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్టు ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో వామపక్ష పార్టీల సమావేశాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఏఏను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. వచ్చింది. ఈ చట్టం మత రాజకీయ దురుద్దేశ్యాలతో కూడుకొని వున్నది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మతోన్మాద, కార్పొరేట్ విధానాలతో పాటు, సీఏఏను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా విస్తతంగా క్యాంపెయిన్ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2024 మార్చి 22న సాయంత్రం 5.30 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం, కళానిలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తాం. రాష్ట్రంలోని వామపక్ష పార్టీల సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె రమ , నాయకులు హన్మేష్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్దన్, నాయకులు ఎం శ్రీనివాస్, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి జి రవి, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సమస్యలను పక్కదోవ పట్టించడానికి మతోన్మాద విధానాలను ముందుకు తెస్తున్నదని విమర్శించారు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నదనీ, దాడులకు పాల్పడుతున్నదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోని గవర్నర్ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటూ ఆయా ప్రభుత్వాలను పడగొడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీ దాడులు చేయించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లో చూపుతూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ సంపదను వాటికి దోచి పెడుతున్నదని విమర్శించారు. కార్మికులకు వ్యతిరేకంగా లేబర్‌కోడ్‌లను తెచ్చిందని తెలిపారు. నల్లచట్టాలను తెచ్చి రైతుల నడ్డి విరుస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీ మతోన్మాద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 22న నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.