
పెద్దకొడప్ గల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా బేగంపూర్ అంజని,తలాబ్ తాండ, చావునితాండ,పోచారం,లింగంపల్లిగ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించగా ప్రజలు వారి గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారుఅంజనీ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు గ్రామంలో ఉన్న పాఠశాల స్థలాన్ని స్థానికులు కబ్జా చేస్తున్నారని పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒక ఉపాధ్యాయురాలను వేరే పాఠశాలకు డిప్రెషన్ పై పంపించారని అలాగే చెరువు నుండి కాలువ నిర్మిస్తే చెరువు కింద ఉన్న ఉన్న రైతులకు పంట పంటలు అధికంగా పండుతాయని కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరారు. తలాబ్ తాండ సమావేశంలో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తాగునీటి సమస్య పోడు భూముల సమస్య గ్రామంలో కరెంటు పోల్స్ పాఠశాల శిథిలావస్థలో ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే నాగమడుగు ఇరిగేషన్ ద్వారా వడ్లం చెరువు నుండితలాబ్ తాండ గ్రామం వరకు పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు వారి వారి సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలను అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతోటి మండలంలోని ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించిన గ్రామాలను మాత్రం అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి ఆయా గ్రామాలలో ప్రజలు తీసుకొచ్చిన వారి సమస్యలను అధిష్టానంతో దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే పోచారం గ్రామానికి వెళ్లే బ్రిడ్జ్ కూలిపోయి చాలా రోజులు గడుస్తున్న అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఇప్పటివరకు బ్రిడ్జ్ కాకపోవడం వాళ్లు అభివృద్ధి చేయలేరు అనేదానికి నిర్దర్శనమని అన్నారు కొన్ని రోజుల్లోనే పోచారం గ్రామానికి బిర్జునునిర్మిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బేగంపూర్ గ్రామంలో గోపాల్ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాజీ సర్పంచులు నాగిరెడ్డి, గణపతి మధన్, పార్టీ నాయకులు పండరి, మోహన్, గోపాల్, జైపాల్, సంజీవ్, బస్వరాజ్ దేశాయ్,నాందేవ్,అంజా గౌడ్,సాయ గౌడ్, రషీద్,ఫెరోజ్, ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.