– చెరుకూరు గ్రామంలో వైభవంగా ఈదమ్మ, మాంధాత, మాతంగి ఉత్సవాలు
– పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన గోలి
నవతెలంగాణ-ఆమనగల్
గ్రామ దేవతలను పూజిస్తే అధ్యాత్మిక వైభవం సిద్ధిస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని చెరుకూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా బుధవారం ఈదమ్మ, మాంధాత, మాతంగి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ హాజరై ఈదమ్మ, మాంధాతలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు, పాడి పరిశ్రమలు ప్రతి ఇంట తులతూగాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు. అంతకు ముందు ఉత్సవాల నిర్వాహకులు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు గ్రామానికి విచ్చేసిన గోలి శ్రీనివాస్ రెడ్డిన పూల మాలలు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొనడంతో ప్రతి ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.