పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు

నవతెలంగాణ:రెంజల్ : ఉపాధ్యాయుల సేవలో పి ఆర్ టియు సంఘం ముందు ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. కమలాకర్ రావు స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండలం నీల జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జి టి ఉపాధ్యాయులకు నూతనంగా 5 000 ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి తమ వంతు కృషి జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పించే బాధ్యత సంఘం దేనిని అన్నాడు. రానున్న కాలంలో ఉపాధ్యాయుల డీఏలను రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి ఇప్పించే బాధ్యతను తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పిఆర్టియు వెంటనే స్పందించి వరి సమస్యలను పరిష్కారంలో ముందంజలో ఉంటుందని, ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, టిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, ఆంజనేయులు, సాయి రెడ్డి, నరసింహారెడ్డి, తాహర్ , కిషోర్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.