కార్మికుల పట్ల మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ చందు
– వారి న్యాయపరమైన డిమాండ్లను అమలుచేయాలి
– రెండో రోజుకు చేరిన కార్మికుల రిలే నిరాహార దీక్ష
నవతెలంగాణ-యాచారం
కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరి స్తుందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ చందు అన్నా రు. మండల కేంద్రంలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మ య్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ చందు నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ..కార్మికులపట్ల రాష్ట్ర ప్రభు త్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెం టనే వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. 22 ఏండ్లుగా సేవలందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని విమ ర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరల కను గుణంగా బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు ఆపాలని అన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు మల్లారి, చంద్రకళ, పద్మ, నరేందర్‌, కళమ్మ, బుజ్జమ్మ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.