అధునాతన సాంకేతికతతో రాష్ట్ర రహదారులు

– రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
– ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన సాంకేతికతతో రాష్ట్రంలోని రహదారులను నిర్మిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాల యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌రోడ్‌ టెక్నాలజీ, ఇంటిలి జెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యూచరిస్టిక్‌ ఆటోమేటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌, ఐసీటీ వంటి అధునాతన పద్ధతులను రోడ్ల నిర్మాణంలో వినియోగించి రహదారి మరణాలను తగ్గిస్తామన్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రామాకేర్‌ సెంటర్‌ నిర్మాణంలో ఉందని వారికి వివరించారు. ప్రపంచబ్యాంకు సహకా రంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న రోడ్లు, వాటి తీరు తెన్నులు బ్యాంకు రవాణా రంగ ప్రధాన అధికారి రీనూ అనుజా పీపీటీ రూపంలో మంత్రికి ఈ సందర్భంగా వివరించారు.
తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలు ఎలా నివారించారు? ఎంత శాతం మరణాల రేటు తగ్గిందన్న విషయాలను గణాంకాలతో వివరించారు. ఇంటిలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల ప్రమాదాలకు చెక్‌ పెట్టొచ్చని తెలిపారు. తెలంగాణ విజన్‌కు అనుగుణంగా అర్భన్‌ ఏరియాలను రూర్బన్‌ కు విస్తరించడం, మెగా క్లస్టర్ల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించడం, విమెన్‌ స్కిల్లింగ్‌ హబ్స్‌ ఏర్పాటు వంటి నూతన విధానాల ద్వారా రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయవచ్చని పేర్కొ న్నారు. రాష్ట్రంలో ఇన్నోవేటివ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ ద్వారా ఆర్ధిక సహకారం అందించేం దుకు అనువైన ప్రాజెక్టుల గురించి ఆమె మంత్రికి వివరించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.