విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు ఆకాంక్షించారు. మంగళవారం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు మంథని నియోజకవర్గన్ని సరస్వతి నిలయంగా మార్చడమే తమ లక్ష్యమని అందుకు అందుబాటులోకి వివిధ విద్యాలయాలను స్థాపించమని, మారుమూల గ్రామాలకి చెందిన విద్యర్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాలను మార్చేవిధంగా కృషి చేస్తామన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. తల్లితండ్రులు కూడా వారికి ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అలాగే వయసు తో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు.