వినూత్నమైన బోధనతో స్వరూపకు రాష్ట్రస్థాయి పురస్కారం

నవతెలంగాణ కంఠేశ్వర్
 తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది . దానిలో భాగంగా ఈరోజు రవీంద్రభారతిలో మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ నుండి రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ఉపాధ్యాయులను ఉప ముఖ్యమంత్రి బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు . నిజామాబాద్ జిల్లా నుండి గురుకుల ధర్మారంలో పనిచేస్తున్న ఏ.స్వరూప పిజిటి ఇంగ్లీష్  రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగ ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం పొందారు . ఈమె గత ఏడు సంవత్సరాల నుండి ఉత్తమ బోధనతోపాటు పిల్లలకు విూత్న విధానంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గేమ్స్, రోల్ ప్లే, స్కిట్స్, లుసిడా అండ్ కర్సు హ్యాండ్ రైటింగ్ రూపంలో ప్రవేట్ స్కూల్ కు దీటుగా పిల్లలకు ఉత్తమ బోధన చేసినందుకు రాష్ట్రస్థాయి పురస్కారము ఇవ్వడం జరిగింది. వీళ్ళ భర్త కంచరి రవికుమార్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, నవీపేట్ లో పిజిటి కామర్స్ గా పనిచేస్తున్నారు.