29 నుంచి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలు

State level fencing competitions from 29– జాతీయ చాంపియన్‌షిప్స్‌కు రాష్ట్ర జట్ల ఎంపిక ట్రయల్స్‌
హైదరాబాద్‌ : జాతీయ జూనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ 2023లో పోటీపడే తెలంగాణ రాష్ట్ర జట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 29 నుంచి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌, సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. వరంగల్‌ మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు అండర్‌-14, కాడెట్‌ (అండర్‌-17) బాలురు, బాలికల రాష్ట్ర స్థాయి 4వ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఫెన్సింగ్‌ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కోశాధికారి సందీప్‌ కుమార్‌ జాదవ్‌లు తెలిపారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి 4వ సబ్‌ జూనియర్‌ పోటీల పోస్టర్‌ను ఫెన్సింగ్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు ఆవిష్కరించారు. అండర్‌-14 విభాగంలో పోటీపడాలనుకునే ఫెన్సర్లకు జనవరి 1, 2010 తర్వాత, అండర్‌-17 విభాగంలో జనవరి 1, 2007 తర్వాత పుట్టిన వారైన ఉండాలని నిబంధనలు నిర్దేశించారు. క్రీడాకారులు ఆధార్‌ కార్డ్‌, నాలుగు పాస్‌పోర్ట్‌ ఫోటోలు సహా వ్యక్తిగత ఫెన్సింగ్‌ కిట్‌ను తీసుకుని సెప్టెంబర్‌ 29న ఉదయం వరంగల్‌ మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియంలో హాజరు కావాలని సూచించారు.