నవతెలంగాణ – జన్నారం
పదవ తరగతి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన బయోసైన్స్ టాలెంట్ పరీక్ష లో జెడ్పిహెచ్ఎస్ కలమడుగు విద్యార్థి మంతెన అంజన్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడనీ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి యాదయ్య పాఠశాల గైడ్ టీచర్ ముల్కళ్ళ తిరుపతి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని, విద్యార్ధి అంజన్ ను అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదివితే మంచి రిజల్ట్స్ వుంటాయని తెలిపారు. రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మంచి రిజల్ట్స్ సాధించాలన్నారు. జన్నారం మండలంలోని పాఠశాలలు చాలా బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, ఏ ఏ పీ సి చైర్మన్ పాఠశాల ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని అభినందించారు.