అక్టోబర్ 27, 28 న పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయలని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి మెస్రం భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. అందుకే అక్టోబర్ 27,28 తేదీలలో పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని లో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, నిర్ణయాలు ఉంటాయని, ఈ వర్క్ షాప్ కు రాష్ట్రం నలుమూలల నుండి యువజన నాయకత్వం పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కొట్నక్ ఆనంద్, బాలు, పెండూర్ దిలీప్, కిరణ్, అనిల్ కుమార్, రమేష్ పాల్గొన్నారు.