
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నేడు ఆదివారం పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్టుగా తెలిసింది.ఈ సందర్భంగా దుద్దిళ్ల మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.3.30 నుంచి రాత్రి 7 గంటల వరకు రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.అనంతరం 8 గంటల నుంచి మంథని నియోజకవర్గంలో పర్యటించనున్నట్లుగా తెలిసింది.