మండలంలోని కొయ్యుర్ గ్రామంలో మంగళవారం రాష్ర్ట ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలను పంపిణీ చేశారు. అంగన్వాడి పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేసి అంగన్వాడి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో కాటారం అదనపు కలెక్టర్ మయాంక్ సింగ్, పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజి ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,సిడిపిఓ రాధిక, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, మహిళ అధ్యకురాలు కొండ రాజమ్మ,అడ్వాలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు నాయక్,మమత,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.