మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన నాయకులు

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి పరిశ్రమలు, వాణిజ్య మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఎంవోయుల విలువ సుమారు రూ.40,232 కోట్లు తేవడం, రాష్ట్ర విభజన తర్వాత ఇవే అతిపెద్ద పెట్టుబడులు.  ఐటీ ఇండస్ట్రియల్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు  దావుస్ పర్యటన ముగించుకుని ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా  సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి శ్రీధర్ బాబు  కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45రోజులు కాకముందే రూ.40,232 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చిన ఘనత  కాంగ్రెస్ పార్టీదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.