హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ బి.సి. అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ ఆధ్యాపకుల సంఘం ఆంగ్ల నూతన సంవత్సరం 2025. క్యాలెండర్ స్టిక్కర్ లను ఆవిష్కరించరు. ఈ సందర్భంగా తెలంగాణ బి.సి అధ్యాపకుల సంఘం (రి.నెం.471/2024) వ్యవస్థాపక అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం ఎంతో చరిత్రత్మకమైన ప్రాంతమని ఇక్కడ తెలంగాణ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమం విజయవంతమైందన్నారు. బీసీ ఉద్యమాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. త్వరలో పూర్తి స్ధాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల స్థాయి కమిటీలలో మార్పు చేర్పులు చేసి, తెలంగాణ వ్యాప్తంగా బి.సిలను చైతన్యం చేయాలని, బి.సి.ల జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, మొ..వివిధ అన్ని రంగాల్లో బిసిలకు సమాన అవకాశాలు, అన్ని రంగాల్లో సమాన వాటా బిసిలకు దక్కాలని, బీసీ మేధావులుగా సామాజిక బాధ్యతగా అన్ని రంగాల్లోని బీసీ ఉద్యోగులు, లెక్చరర్స్ సామాజిక బాధ్యతతో ఉద్యమించాలని అప్పుడే బీసీలకు సామజిక న్యాయం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి విఠల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, మేమెంతో మాకంత వాటా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు దక్కాలని, బీసీ అధ్యాపకుల సంఘం అంటే కేవలం ప్రభుత్వ అధ్యాపకులు మాత్రమే కాదని ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మొదలైన పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల లలో బోధన వృత్తి లో ఉన్న బి.సి లెక్చరర్స్ అని, బీసీ మేధావులతో నిరంతరం మేధో మథనం చేసి భవిష్యత్తు కార్యాచరణను చేపడుతామని తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అందుకు రాజ్యాంగ సవరణ చేయాలని , బీసీల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించాలని, కేంద్ర విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుండి 60 శాతానికీ పెంచాలని అన్నారు. బీసీ అధ్యాపకుల సంఘం క్యాలెండర్ స్టిక్కర్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో వివిధ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఆవిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసరవేణి పరశురాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మండలోజు నరసింహస్వామి,గంద్యాడపు సంతోష్ కుమార్, బి. శేఖర్, సిహెచ్.శంకర్, టి. మచ్చేందర్,ఏం. ఈశ్వర్, కృష్ణ, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది రాజేందర్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, సోషల్ వెల్ఫేర్ గురుకుల మైనారిటీ వెల్ఫేర్ మొదలైన ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్టు ఔట్సోర్సు, తదితర కళాశాలలో బోధించే అధ్యాపకులు పాల్గొన్నారు.