– యశోదలో ఏర్పాటు
హైదరాబాద్ : డయాగ్నోస్టిక్ ఇమేజింగ్, సమాచార వ్యవస్థలలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజిఫిల్మ్ ఇండియా అత్యాధునిక ఎరిటా 850 ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ మిషన్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. దీనిని దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ప్రారంభించినట్లు పేర్కొంది. ఇది జీర్ణశయాంతర వ్యాధులకు రోగనిర్ధారణ కచ్చితత్వం, ఇమేజ్ స్పష్టతను పెంచనుందని వెల్లడించింది.