సీఎం సహాయనిది ఆర్థిక భరోస కల్పిస్తుంది: రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్

నవతెలంగాణ- జక్రాన్ పల్లి 
 జక్రన్ పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన లస్మాయికి రూ ₹ 60,000/ విలువగల సిఎంఆర్ఎఫ్ చెక్కును రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం అందజేశారు.ఈ సందర్బంగా నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్  మాట్లాడుతూ… అనారోగ్యం బారిన పడిన పేద వారి కోసం ప్రభుత్వం సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. పేదవారికి శస్త్ర చికిత్స నిమిత్తం ముందస్తు చికిత్స కోసం ఎల్ వో సి ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను రక్షించడం జరుగుతుందని,అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుంది అని అన్నారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 30 కోట్లకు పైగా విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల నుద్దేశించి అమలు చేస్తుందని అన్నారు..రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి, మరియు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ కి,దర్పల్లి జడ్పిటిసి సభ్యులు శ్రీ  బాజిరెడ్డి జగన్మోహన్ గార్లకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి,రాజారెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు