నవతెలంగాణ – చండూరు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేవాదళ్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాల్జీ ధీసాయి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపదాస్ మున్సి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గండూరి నరసింహ పాల్గొన్నారు.