– 3 రోజులు త్రిపుర మాజీ సీఎం మాణిక్‌సర్కార్ ఎన్నికల ప్రచారం
– నేడు జనగామ, హైదరాబాద్‌కు సుభాషిణీఅలీ రాక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి సంబం ధించి సీపీఐ(ఎం) జాతీయ నాయకుల పర్యటన ఖరారైంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఖమ్మంలో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. అదేరోజు మధిర నియోజకవర్గం ముదిగొండలో నిర్వహించే సభకు హాజరవుతారు. ఈనెల 25న శనివారం భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడులో పర్యటిస్తారు. అదేరోజు సాయంత్రం భద్రాచలం పట్టణంలో రోడ్‌షోలో పాల్గొంటారు.
ఈనెల 26న ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో జరిగే సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారు. శుక్రవారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషినీ ఆలీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం ఉదయం జనగామ నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.