
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాలకవర్గాన్ని ప్రకటిస్తూ ఏపీసి కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ గా స్థానిక సుంకేట బుచ్చన్న తోపాటు మరో 16 మంది పాలకవర్గ సభ్యులతో కూడిన జాబితాను ఏపీసి కార్యదర్శి రఘునందన్ రావు ప్రకటించారు. పాలకవర్గ సభ్యులుగా జైడి మధులత, రిక్క ముత్తెన్న, నర్సాపురం జీవన్, క్రిష్టి చిన్న బాబన్న, బాణావత్ రాములు, రొక్కం సంపత్, లక్మ రంజిత్, కోరేపల్లి లింగారెడ్డి, బూత్ పురం మహిపాల్, అబ్దుల్ నవీద్, జవాజి శ్రీనివాస్,జొన్నల నడిపి భూమయ్య లతోపాటు భీంగల్ మండలం ముచ్కూర్ సింగిల్ విండో చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, భీంగల్ ఏడిఏ, కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.