మతోన్మాదాన్ని పెకిలించేలా ఉక్కు ఉద్యమాలు నిర్మించాలి

– మంద నరసింహ రావు, భూక్యా రమేష్‌ పిలుపు
– కార్మిక అడ్డాల్లో ఘనంగా సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-కొత్తగూడెం
మతోన్మాదాన్ని పెకిలించేలా ఉక్కు ఉద్యమాలు నిర్మించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహ రావు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్‌లు పిలుపు నిచ్చారు. మంగళవారం కార్మిక వర్గ పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన సిఐటియు సంఘ 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెంలోని పలు కార్మిక అడ్డాలో సిఐటియు జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ రావు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్‌ మాట్లాడుతూ సీఐటీయూ అవిర్భావం తర్వాత కార్మిక వర్గ పోరాటాలకు నూతన ఉత్సాహం పెరిగిందన్నారు. కార్మిక హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం నిర్విరామ పోరాటాలు చేసిన ఘనత సీఐటీయూదేనని అన్నారు. అన్నదమ్ముల వలె ఉన్న దేశాన్ని కులమతాల కొట్లాటలతో అనేక సమస్యలు సృష్టిస్తున్న బిజెపి మతోన్మాదం పాలనపై ఐక్యంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ఇప్పటికే కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా చేసి కార్మిక వర్గ ఐక్యతను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ సంస్థలను అమ్మేసి తిరగమనంలోకి నడుపుతున్న బిజెపి విధానాలపై పోరాటం కొనసాగిస్తున్న కార్మిక వర్గం, మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే విధంగా కార్మికులు కర్షకుల మైత్రితో దేశంలో, రాష్ట్రంలో బిజెపికి ఆర్‌ఎస్‌ఎస్‌కి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు విజయగిరి శ్రీనివాస్‌, జాకబ్‌, వై.వెంకటేశ్వర్లు, వైఎన్‌.రావు, గడల నరసింహ రావు, సైదులు, శ్రీకాంత్‌, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం…పలు ప్రాంతాల్లో జండాల ఆవిష్కరణ
సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జండాలు ఎగురవేశారు. అంగన్వాడి, హాస్పిటల్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, హాస్పిటల్‌, ఆటో యూనియన్‌ అడ్డా, సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల అడ్డాలు, హమాలి, వివోఏ, కార్మికుల్లో ప్రచారం చేస్తూ సిఐటియు జెండా ఆవిష్కరణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్యామ్‌, మాధవి, రేష్మ, ఆది, గంగ, శివారెడ్డి, సక్రం, ప్రభాకర్‌, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంటౌన్‌ : సిఐటియూ 53వ ఆవిర్భావదినోత్సవ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం ఆద్వర్యంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. కాంట్రాక్టు కార్మికుల అడ్డాలో సిఐటియూ జెండాను ఎగురవేశారు. బ్రాంచ్‌ కార్యదర్శి గిడ్ల శ్యామ్‌ కుమార్‌ అధ్యక్షతన సింగరేణి హెడ్‌ ఆఫీస్‌ సెంటర్లో కార్మికుల సమ క్షంలో జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, ట్రాన్స్‌పోర్టు డిపా ర్ట్మంట్‌ దగ్గర జి.శ్యామ్‌ కుమార్‌, సెంట్రల్‌ స్టోర్స్‌ ముందు సక్రు జెండాని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.