అంచలంచెలుగా అల్వాల అభివృద్ధి

– మంత్రి, ఎంపీ సహాయంతోని ప్రత్యేక నిధులు : వైస్‌ ఎంపీపీ పోలీస్‌ రాజులు
నవతెలంగాణ-మిరుదొడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంచలంచెలుగా అల్వాల గ్రామం మరింత అభివృద్ధి చెందింది. గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి ఎంతగానో కషి జరుగుతుందని వైస్‌ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అల్వాలను అభివృద్ధి పదం నడపడం పట్ల అల్వాల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిల సహకారంతో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చెందిన పట్ల అల్వాల గ్రామం పక్షాన ప్రత్యేకంగా వారికి వైస్‌ ఎంపీపీ పోలీస్‌ రాజులు సర్పంచ్‌ కిష్టయ్య ధన్యవాదాలు తెలిపారు. అల్వాల గ్రామంలో మంత్రి హరీష్‌ రావు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిల సహకారంతో పదిలక్షల ముదిరాజ్‌ భవనము, ఎస్సీ కమిటీ హాల్‌ 10 లక్షలు మార్కెట్‌ గోదాం 16 లక్షలు నూతన గ్రామపంచాయతీ భవనానికి 18 లక్షలు 16 లక్షలు తోపాటు గ్రామంలో సిసి రోడ్లు గ్రామంలో సిసి రోడ్లు మురికి కాలువలు, డంపు యాడు స్మశాన వాటిక ఎస్సీ బీసీ కమిటీ హాల్‌తో పాటు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులవత్తులకు మరియు వద్ధులకు వికలాంగులకు ఆసరాపించిన అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని వారు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో గ్రామాల్లో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తుందని తెలిపారు ప్రతి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు పేదోడికి అండగా ప్రభుత్వం ఉందని మనం సూటిగా చెప్పకపోవచ్చన్నారు మంత్రి హరీష్‌ రావు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి లు దుబ్బాక నియోజకవర్గం మరింత అభివద్ధి చెందడానికి వారు చేసిన కషి మరువలేదన్నారు.