ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు నూతన టెక్నాలజీలతో ముందడుగు వేస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ముత్యాల రాజు, డైరెక్టర్ డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి టీజీఎప్‌సెట్ మొదటి విడత కౌన్సిలింగ్‌లో 300పైగా బీటెక్ అడ్మిషన్లు వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లాస్ వర్క్‌తో పాటు వివిధ రంగాలలో విద్యార్థులకు నైపుణ్యత పెంపొందించుటకు ప్రతి సంవత్సరం 35 రకాల ప్రోగ్రామ్స్S నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొత్త టెక్నాలజీతో వర్క్ షాప్స్ నిర్వహించడం, ఇండస్ట్రియల్ విజిట్స్ చేపట్టడం జరుగుతుందన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 200 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత కంపెనీలలో ఫ్లేస్‌మెంట్స్ ఇప్పించడం జరిగిందన్నారు. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, యాంటి డ్రగ్స్ సదస్సులు, పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.