పక్కా మాస్‌ బీట్‌తో స్టెప్పామార్‌

పక్కా మాస్‌ బీట్‌తో స్టెప్పామార్‌రామ్‌ పోతినేనిన్‌, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రాబోతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌-ఇండియన్‌ ప్రాజెక్ట్‌, మచ్‌ ఎవైటెడ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌ ఇది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్‌ చేయాలని మేకర్స్‌ చూస్తున్నారు. టీజర్‌కు సెన్సేషనల్‌ రెస్పాన్స్‌ వచ్చిన తర్వాత టీమ్‌ తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ ‘స్టెప్పా మార్‌’తో మ్యూజిక్‌ ప్రమోషన్‌లను ఆరంభించారు. స్టెప్పా మార్‌ ట్రూలీ మాస్‌ డ్యాన్స్‌, రిథమ్‌, హై ఎనర్జీని సెలబ్రేట్‌ చేసుకునే సాంగ్‌. రామ్‌ పోతినేని అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌, పూరి జగన్నాథ్‌ స్టైలిష్‌ టేకింగ్‌, విజువల్‌ మాస్‌ ఫీస్ట్‌లా ఉంది. వోకల్స్‌, లిరిక్స్‌ లిజనర్స్‌కి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆకట్టుకునే లిరిక్స్‌ ఉన్న ఈ పాట సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు. మణిశర్మ కంపోజ్‌ చేసిన ఈ ఇన్‌స్టంట్‌ చార్ట్‌బస్టర్‌ మ్యూజిక్‌ ప్రమోషన్‌లను అద్భుతంగా ప్రారంభించింది. భాస్కర భట్ల సాహిత్యం హీరో వైబ్‌ని గొప్పగా వర్ణిస్తుంది. ప్రతి ఒక్కరికీ విన్న వెంటనే కనెక్ట్‌ అవుతుంది. అనురాగ్‌ కులకర్ణి, సాహితీ తమ డైనమిక్‌ వోకల్స్‌తో సాంగ్‌కి మాస్‌ టచ్‌ జోడించారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అద్భుతమైన మూమెంట్స్‌ మరొక హైలైట్‌. ఇందులో రామ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేశాయి. పవర్‌ఫుల్‌ విజువల్స్‌, డైనమిక్‌ కెమెరా వర్క్‌ సాంగ్‌ని మరింత ఎలివేట్‌ చేసి మస్ట్‌ వాచ్‌గా నిలిపాయి. బాలీవుడ్‌ స్టార్‌ సంజరు దత్‌ కీలక పాత్రలో నటించగా, కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రం బిగ్‌ బడ్జెట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అలీ, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌, నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, సిఈవో: విష్‌, సంగీతం: మణి శర్మ, సినిమాటోగ్రఫీ: సామ్‌ కె నాయుడు, జియాని జియాన్నెలి, స్టంట్‌ డైరెక్టర్‌: కేచ, రియల్‌ సతీష్‌.