నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడానికి అందిస్తున్న రేషన్ బియ్యం లబ్ధిదారులకు సకాలంలో అందేలా రెవెన్యూ అధికారులు రేషన్ డీలర్లపై చర్యలు చేపట్టాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ శనివారం ఒకప్రకటనలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లు భారీ అవకతవకలకు పాల్పడుటున్నట్లుగా ఆరోపించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లు బియ్యం కోసం షాపుల వద్దకు వెళ్తే సాంకేతిక సమస్య ఉందని ప్రజలకు తిప్పి పంపిస్తున్నారన్నారు. అంతేకాకుండా బియ్యానికి బదులు నగదు లేదా ఇతర వస్తువులు అంటగడుటున్నట్లుగా వాపోయారు. పల్లెల్లో రేషన్ దుకాణాలు చిన్ననాటి కిరాణా దుకాణాలగా మార్చారని ఆరోపించారు. ఇట్టి విషయంపై పలుమార్లు మండల తాసిల్దారు ఫిర్యాదు చేసిన ఎలాంటి విచారణ చర్యలు చేపట్టకపోవడంలో ఉన్న అంతర్యంమేమిటని ప్రశ్నించారు. పేదల బియ్యం అర్థరాత్రి అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్నారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.